రాయికల్ బంద్ సంపూర్ణం

Published: Friday September 23, 2022

రాయికల్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ హిందూ ఐక్యవేదిక ఇచ్చినబంద్ పిలుపుమేరకు రాయికల్ పట్టణంలో వర్తక,వ్యాపార, వాణిజ్య దుకాణాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాయి.బంద్ కు సహకరించిన రాయికల్ పట్టణ వ్యాపారులందరికీ హిందూ ఐక్యవేదిక కృతజ్ఞతలు తెలిపారు. బంద్ లో పాల్గొన్న హిందూ ఐక్యవేదిక నాయకులను మరియు విశ్వహిందూపరిషత్,బజరంగ్ దళ్,బిజెపినాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.