అధిక విద్యుత్ బిల్లుపై విచారణ చేయకుండా దౌర్జన్యంగా కనెక్షన్ తొలగిస్తున్న అధికారులు

Published: Wednesday September 01, 2021
మేడిపల్లి, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి) : అధిక విద్యుత్ బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఎన్నిసార్లు తల,నోరు మొత్తుకొని చెప్పిన ఉప్పల్ విద్యుత్ అధికారులు మాత్రం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులపై ఎలాంటి విచారణ చేయకుండా వచ్చిన బిల్లును కట్టాలి లేకపోతే విద్యుత్ కనెక్షన్ను కట్ చేస్తామని, దౌర్జన్యంగా ఇంటి విద్యుత్ కనెక్షన్ కట్ చేసి పోతున్నారు. ఈ మేరకు  ఉప్పల్లో నివాసముండే ఎం శ్రావణి భర్త నవీన్ ఫ్లాట్ నెంబర్ 102 పుష్ప ఎంక్లేవ్ విజయపూర్ కాలనీ నివాసముంటున్నాడు. వీరికి ప్రతి నెల రు 1000/- వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే  జూలై మాసానికి విద్యుత్ బిల్లు రూ 9913/ తప్పుగా వచ్చింది. ఈ అధిక బిల్లు విషయాన్ని ఉప్పల్ విద్యుత్ ఏఈ మధురంజన్ లైన్ మెన్ అశోక్ కు ఫిర్యాదు చేశారు.  వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండా అధిక బిల్లును చెల్లించ మంటూ ఒత్తిడి చేస్తూ చెల్లించాల్సిన గడువు అయిపోయింది అంటూ దౌర్జన్యంగా విద్యుత్ కలెక్షన్ తొలగించి మనస్థాపానికి గురి చేశారంటూ ఆరోపించాడు. అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లును నవీన్ రూ 9913/ పేటీఎం ద్వారా చెల్లించాడు. వినియోగదారుడు అధిక బిల్లుపై ఇచ్చిన ఫిర్యాదు పరిశీలించకుండా బిల్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేసి కనెక్షన్ తొలగించిన ఏఈ మధురంజన్ లైన్మెన్ అశోక్ పై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని శ్రావణి నవీన్ విద్యుత్ ఉన్నత అధికారులను కోరుతున్నారు.