ఓటు అనేది చాలా విలువ అయినది ప్రతి ఒక్క యువత అందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోండి బూర్గంపాడ

Published: Tuesday November 29, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

ఓటు హక్కు చాలా విలువైనదని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అంతేకాకుండా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేసుకోవాలని లేనియెడల మీ ఓటుని మీరు కోల్పోయే ప్రమాదం ఉందని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రకటనలో తెలిపారు. ఫామ్ సిక్స్ ను ఉపయోగించి మీకు ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని ఎవరైతే కొత్త ఓటర్లు ఉన్నారు త్వరితగతిన  మీ సమీప బిఎల్వోల దగ్గర లేదా మీ సమీప మీసేవ  కేంద్రాలలో మీ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఓటు హక్కు అనేది చాలా విలువైనదని ఓటు హక్కు ద్వారానే మీరు నచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చని కాబట్టి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చని వారు తెలియజేశారు. యువతీ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లోకి యువత పాత్ర ముఖ్యమైనదని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అలాంటి ఓటు హక్కును సరైన సక్రమ మార్గంలో వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు కల్పించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతేకాకుండా ఈరోజు మహాత్మా డాక్టర్ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా ప్రజలందరి తరపున కూడా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగినది. పూలే యొక్క సంస్కరణలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అణగారిన వర్గాలకు దారి చూపిన ధీరుదాతుడని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.