లాక్ డౌన్లోనూ ఆగని అక్రమాలు.. యథేచ్ఛగా మట్టి విక్రయాలు.. ఆగని దందా.

Published: Tuesday May 18, 2021
పాలేరు, మే17, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళా దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది... ఎవరు ఎటుపోతే మాకేంటి....మేము మాత్రం దందా ల దారిలో నడుస్తాం అంటున్నారు జేసీబీ, పొక్లెయియ్ యజమానులు. మైనింగ్, రెవెన్యూ ఎవరి అనుమతులు తీసుకోవడం మాకు ఇప్పటి వరకు తెలియదని చెప్తున్నారు. ఏళ్లుగా ఇదే చేస్తున్నామని విర్రవీగుతున్నారు. బయటి ఉల్లలో ఒకట్రిప్ మన్ను 500 నుండి800 రూ విక్రయిస్తున్నారు నేలకొండపల్లి మండల పరిధిలోని కోరుట్లగూడెం గ్రామ శివారులో మట్టి తొలకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వ్యవసాయ బావుల తవ్వకం పేరుతో మట్టి దందా నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండ కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ దందా సాగిస్తున్నారు.  సంబంధిత అధికారులు, రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఇటు వైపు కన్నెత్తి చూడడంలేదు. ఎదో అత్యవసరానికి బయటకు వస్తే ఒళ్లు హూనమయ్యేలా బాదే పోలీసులకు ఈ అక్రమాలు కనిపించడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.