శంకరపట్నంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు శంకరపట్నం ఏప్రిల్02 ప్రజాపాలన రిపోర్

Published: Monday April 03, 2023
శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తులందరూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోల్కొండ కోటను అధిరోహించి విప్లవ వీరుడి పోరాటాన్ని ధైర్య సాహసాలని పోరాట పటిమను స్మరించుకుంటా త్వరలో మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపన జరపనున్నట్లు కేశవపట్నం గౌడ సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గోడిశాల తిరుపతి, గుర్రం శ్రీకాంత్, పంజాల సంపత్ కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్, , బొంగోని తిరుపతి, పూరెల్ల కోటి, బొంగోని శ్రీనివాస్, మొలంగూరి సదానందం, గొడిశాల శ్రీనివాస్, న్యాలం వీరస్వామి,  యువ నాయకులు గొడిశాల ప్రవీణ్, బొంగోని అభిలాష్, చెరుకు శివ, మొలంగూరి శివ, గుర్రం సంపత్ తదితరులు పాల్గొన్నారు.