మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి. మంచిర

Published: Tuesday August 23, 2022

రాష్ట్ర మైనారిటీన్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2022-23 విద్యా సంవత్సరంలో యు.పి.ఎన్.సి. సి.ఎన్.ఎ.టి. 2023 పరీక్ష కోసం 100 మంది మైనారిటీన్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33 శాతం సీట్లు, అన్ని రిజర్వ్ కేటగిరీలలో వికలాంగులకు 3శాతం సీట్లు కేటాయించడం జరుగుతుందని, మైనారిటీస్ స్టడీసర్కిల్లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. యు.పి.ఎన్.సి. (సి.ఎన్.ఎ.టి.-2023) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ప్రవేశం కొరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని సాధారణ / ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీన్ అభ్యర్థుల ద్వారా ఈ నెల 22 నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో http://tmreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం 10 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీన్ విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిఖ్, జైన్ బుద్దిస్ట్, పార్శి) ఈ అవకాశాన్ని నద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు ఆన్లైన్లో http://tmreis.telangana.gov.in, ఫోన్ నం.040-23236112లో సంప్రదివచ్చని తెలిపారు.