నూతన రేషన్ కార్డుల పంపిణీ

Published: Wednesday August 04, 2021
కోరుట్ల, ఆగష్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని కల్లూరు గ్రామంలో మంజూరు అయినా కొత్త రేషన్ కార్డులను గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భగా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ రేషన్ డీలర్ షాప్ పరిధిలో 20 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, అర్హత వుండి రేషన్ కార్డులు మంజూరు కానీ వారి యొక్క జాబితా ఉన్నత అధికారుల మరియు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్ళి సకాలంలో నూతన కార్డులు మంజూరు అయ్యేలా కృషీ చేస్తానని సర్పంచ్ అంజయ్య తెలియజేశారు .