మున్సిపాలిటీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహింస్తం సిఐటియు డిమాండ్*

Published: Thursday August 18, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ17 ప్రజాపాలన ప్రతినిధితట్టి అన్నారం సర్వే నెంబర్ 127/2,127/3లో అక్రమ నిర్మాణాలు కూల్చివే చేసేంతవరకు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు వంట పెట్టుకొని ధర్నా చేస్తూ కూలగొట్టే వరకు ఇక్కడి నుండి నుంచి కదిలేదనీ గ్రామ ప్రజలందరూ కూర్చున్నారు.
తట్టి అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 127/2,127/3లో మున్సిపాలిటీ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గత సంవత్సర కాలంగా ధర్నాలు చేసి కమిషనర్ కి దరఖాస్తు ఇచ్చినప్పటికీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయం ముందు, వంట వర్క్ బిట్ ధర్నా చేసిన, మున్సిపాలిటీ కమిషనర్ నిర్లక్ష్యంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. పునాది వేయక ముందు  నుండి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణం జరిగిన తర్వాత చట్టమని అడ్డుపెట్టుకొని నిర్మాణదారులకు సహకరిస్తున్నారు నిర్మాణదారులకు సహకరిస్తున్నారు. ఈరోజు చేసిన ధర్నాలు సిపిఎం మండల కార్యదర్శి ఈ నరసింహ. బీఎస్పీ జిల్లా కార్యదర్శి మాజీ ఎంపీటీసీ నల్ల ప్రభాకర్, మాట్లాడుతూ. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని లేని ఎడల కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్క రవికుమార్ ,మునీందర్ రెడ్డి. సర్వయ్య, సౌజన్య, భాగ్యమ్మ, పద్మమ్మ, మల్లయ్య సుధాకర్ గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.