కాగజనగర్ టౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న కె.రవీందర్

Published: Tuesday November 30, 2021
కాగజనగర్, నవంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : కాగజ్ నగర్ టౌన్ సిఐగా పనిచేసిన మోహన్ బదిలీ కాగా అతని స్థానంలో కొత్తగా టౌన్ సిఐ గా కె.రవీందర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో రవీందర్ కాగజనగర్ రూరల్ ఎస్ఐ గా పని చేశారు. కె.రవీందర్ మాట్లాడుతూ కాగజనగర్ లో శాంతిభద్రతలు కాపాడుతానని మరియు అక్రమ దందాలపై ఉక్కుపాదం వహిస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఏమైనా సమస్యలు ఉంటే న్యాయం జరగకపోతే స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని పోలీసులకు సహకరించాలని తెలిపారు.