120 రోజుల తర్వాత గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఇంటికి చేరిక

Published: Friday July 08, 2022
కోరుట్ల, జూలై 07 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్,యజమాని చేతిలో చిత్రహింసలకు గురై, అక్రమ కేసు పెట్టడం ద్వారా, ఇంటికి రాలేక మనస్థాపానికి గురై సౌదీ అరేబియాలోనే ఆత్మహత్య చేసుకున్నడు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు నారాయణా, రాజేందర్,రఫిక్,చిన్నయ్య, ఇండియన్ ఎంబెసి అధికారుల మరియు నాస్, ఇర్ఫాన్ సహకారంతో మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. 500 కోట్ల నిధులతో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి, నిరుపేద గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఐదు లక్షల రూపాయలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు బడుగు లక్ష్మణ్ విన్నవించారు.