రైతుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైంధి

Published: Tuesday January 25, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ రైతుల వివిధ సమస్యలు పరిష్కరించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యింది అని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు లక్ష లోపు రుణాలు పూర్తి స్థాయిలో మాపి చేస్తాం అని చెప్పి ఇప్పట్టి వరకు రుణాలు మాపి చేయలేదు బ్యాంక్ లో ఉన్న రుణం వడ్డీకి వడ్డీ పెరిగి పోవటంతో బ్యాంక్ లో మహిళలు డ్వాక్రా రుణాలు తీసుకున్న ఇతర ఎలాంటి రుణాలు తీసుకున్న చివరకు రైతు సాగు కోసం ప్రభుత్వంరైతు ఖాతాలో జమ చేసే రైతు బంధు డబ్బులు కూడా వదల కుండ బ్యాంక్ అధికారులు భూమి అప్పుకింద జమ చేసుకుంటున్నారు అని రైతులు ఆందోళన చెందుతున్నారు కొన్ని ప్రాంతాల్లో బ్యాంక్ అధికారులు రైతుల ఇండ్ల దగ్గరకు వెళ్లి ఇంటికి తలలు వేసే సంఘటనలు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది తప్ప బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవటం లేదు అన్నారు అలాగే భూ రికార్డ్ సమయంలో ఎలాంటి కారణం చూపకుండా రైతులకు ఎలాంటి నోటీస్ లు కూడా ఇవ్వకుండా గ్రామాల్లో ఉండే బ్రోకర్ల సహాయంతో ఇష్టం వచ్చినట్టు రైతుల భూముల రికార్డ్ లు తారుమారు చేసి ఎకరాల కొద్దీ భూములు ఆన్ లైన్ రికార్డ్ లో నుండి తొలగించటం జరిగింది ఈ విషం పై తహసీల్దార్ అధికారులకు మేము భూమి కబ్జాలో ఉన్నాము మా భూమి ఆన్ లైన్ రికార్డ్ లో నుండి. తొలగించారు మా భూమి సర్వే చేసి సక్రమంగా ఆన్ లైన్ రికార్డ్ సారి చేయాలని తహసీల్దార్ అధికారులకు దారఖాస్తు చేసుకొని నాలుగు ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావటం లేదు అన్నారు ఈ విషయం తహసీల్దార్ అధికారులను అడుగుతే ధరణి ఆన్ లైన్ పని చేయటం లేదు మా చేతులో ఏమి లేదు అంత పై నుండే అని తల తిక్క సమాధానాలు చెపుతున్నారు రెవెన్యూ అధికారులలే సరైన సమాధానం చెప్పక పోవటంతో రైతులు నాన ఆందోళన చెందుతున్నారు మా సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు అని ప్రభుత్వం రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా సిగ్గు చేటు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి సబ్సిడీ పరికరాలకు విత్తనాలకు మంగళం చెప్పింది అన్నారు రైతు బంధు పథకం రాబందులు పథకంగా మారింది ఎందుకంటే ప్రతి పేద రైతు ఏదో ఒక బ్యాంక్ లో రుణాలు పొంది ఉన్నారు అలాంటి పేద రైతులు రైతు బంధు డబ్బులు బ్యాంక్ నుండి తీసుకో లేక పోతున్నాడు అదే వందల ఎకరాల ఉన్న భూస్వాములకు ఎలాంటి బ్యాంక్ రుణాలు ఉండవు కోట్లలో రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారు అందుకే రైతు బంధు రా బందుల బందుగా మారింది అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెట్టి పాత బకాయి అప్పు పేరిట ఇతర లోన్ డబ్బులు జమ చేసు కోకుండా బ్యాంక్ లపై చర్యలు తీసుకోవాలి లక్ష లోపు రుణాలు వడ్డీ తో సహా మాపి చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అలాగే భూ రికార్డ్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా ఆన్ లైన్ రికార్డ్ లో సక్రమంగా ఉన్న భూములను ఎకరాల కొద్దీ భూములు ఆన్ లైన్ రికార్డ్ నుండి తొలగించిన అప్పట్టి తహసీల్దార్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి రైతులు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూములు సర్వే చేసి ఆన్ లైన్ రికార్డ్ సక్రమంగా సారి చేసి ధరణి పోర్టలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని ఏండ్ల నుండి తాత ముత్తతల నుండి సీలింగ్ అసైన్ మెంట్ భూములో సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న పేద రైతులకు రికార్డ్ లో ఉన్న ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ బుక్ లు ఇవ్వాలి అన్నారు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాం