ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published: Wednesday May 18, 2022

బోనకల్ ,మే 17 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బైపిసి విద్యార్థి కనక పూడి జీవన్ కుమార్ మే 17 మంగళవారం జరిగిన ఇంటర్ ఫిజిక్స్ పరీక్ష లో కాపీ రాస్తూ పట్టుబడి,పరీక్ష కేంద్రం నుండి సిబ్బంది డిబార్ చేసినారు. దీంతో మనస్తాపం చెంది స్వగ్రామమైన గార్లపాడులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నకు పాల్పడ్డాడని,ఆత్మహత్యకు  యత్నిస్తున్న క్రమంలో తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి కాపాడి వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు