గ్రీనరీ తో పాటు పలు అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published: Friday May 21, 2021
బాలపూర్, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : పురాతన కట్టడాలు,ప్రాచీన వారసత్వ సంపదను, బావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పెట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బట్టేల్ గుట్ట వద్ద చేపడుతున్న సుందరికరణ పనులను, బురుజు చుట్టూ ఏర్పాటు చేసిన లాన్ (గ్రినరీ)తో పాటు పలు అభివృద్ధి పనులను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా విశేష ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నారని, వీటిని సుందరికరణ చేయటం తో పర్యాటక స్థలంగా మారుతుందని అధికారులతో సూచించారు. అదే విధంగా దావుద్ ఖాన్ గూడ లోని పార్క్, నర్సరీ లను పరిశీలించి, పార్క్ లు యాంత్రిక జీవనం లో నుండి ప్రజలకు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని ఆమె అన్నారు. చిన్న, పెద్ద, సేద దిరటంతో పాటు, కాంక్రీట్ జంగిల్ లో ప్రకృతి ఓడి లో గడిపే అవకాశం ఉంటుందన్నారు. పట్టణాల్లో పార్క్ లలో ఉదయం సాయంత్రం నడకకు, చిన్న పిల్లలు అడుకోవటానికి ఉపయోగపడతాయనిచెప్పారు. నర్సరీ లో ఉన్న వివిధ రకాల మొక్కలను, స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరు పుట్టిన రోజు, ఇతర ప్రతి ఒక శుభ సందర్పంలో మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణ దేశానికే ఆదర్శం ఇప్పటికే అనేక తెలంగాణ రాష్ట్ర లో  పథకాలు కేంద్రం తో పాటు పలు రాష్టాలు అమలు చేస్తుండగా, కోవిడ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణాలో ప్రారంభించిన ఫీవర్ సర్వే దేశ వ్యాప్తంగా చేపడుతున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పెట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జ్వర సర్వే ను, వైద్య సిబ్బంది తో ఇంటింటి సర్వే లో భాగంగా సేకరిస్తున్న  ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, నగర దీపికలను  వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ లక్షణాలు లేదా జ్వరం,ఇతర గొంతునొప్పి, కోల్డ్ లాంటి సమస్యలు ఉంటే వారికి ప్రభుత్వం తరుపున ఉచితంగా మందులు, కిట్ కు పంపిణీ చేయాలని ఆదేశించారు. వాటితో పాటు వారి పై ప్రత్యేక నిఘా పెట్టాలని, స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండేటట్లు చూడాలని, ఎవరికైనా ఇంట్లో విడిగా ఉండే అవకాశం లేకపోతే, వారికి ఏర్పాటు చేసి దగ్గర లోని ఐసోలేషన్ సెంటర్ కు పంపలన్నారు. ఇతరత్రా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రైవేట్ ఆస్పత్రి కు దీటుగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు..ముఖ్యంగా కోవిడ్ అంటే భయపడి హైరానా పడవద్దని, ధైర్యం తో ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ లో ఇప్పటికే మొదటి విడత జ్వర సర్వే పూర్తి అయిందని, అది సత్పలితాలు ఇచ్చిందన్నారు. గతంలో కన్న రాష్ట్రంలో కేసులు తగ్గు ముఖంపట్టాయని, కోలుకుంటున్న వారి శాతం కూడా పెరిగిందని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కు నియోజకవర్గంలోని ప్రజలందరూ  సహకరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డి ఇ అశోక్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, కార్పొరేషన్ కార్పొరేటర్లు భీమిడి స్వప్న జంగారెడ్డి, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, రొయ్య పల్లి దీపిక శేఖర్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, కార్పొరేటర్లు, నగర దీపికలు, జర్వ  సేవ వైద్య సిబ్బంది, టిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.