ప్రభుత్వం కేటాయించిన భూముల ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు* *అడ్డు వస్తే తుపాకులతో కాల్ చేస్తామని బ

Published: Tuesday February 14, 2023

జవాహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అద్రాస్ పల్లి సమీపంలో 138 సర్వే నంబర్ గల స్థలాన్ని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు. 1959లో మాజీ సైనికుడైన చాడ నర్సింహా రెడ్డి దేశానికి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తస్తూ జవహర్ నగర్ లోని సర్వే నంబర్ 138 గల 5 ఎకరాల స్థలాన్ని జీవనాధారం కొరకు వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించారు. నరసింహారెడ్డి తదనంతరం అతని కుటుంబ సభ్యులు వ్యవసాయం చేస్తూ జీవనాధారం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో యధావిధిగా వ్యవసాయం చేసుకుంటు ఉండగా కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి యత్నించారు. వెంటనే మా స్థలంలోకి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించిన మమ్మల్ని  పలు విధాలుగా దుర్బాషలడుతు "ఈ స్థలం మాది ఇందులోకి ఎవరైనా అడుగు పెడితే తుపాకితో కాల్చి చంపుతామని" బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంపై కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు కథనాలు ప్రచురించారని  నిజానిజాలు వెలుగులోకి వచ్చిన తరువాతనే ప్రచురించాలని కోరారు. అలాగే తమ కుటుంబానికి