సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. ఎంఈవో దామోదర ప్రసాద్..

Published: Wednesday March 29, 2023
తల్లాడ, మార్చి 27 (ప్రజా పాలన న్యూస్):
అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు ద్వారా పరీక్షా సామాగ్రి ,పెన్నులు, జామెట్రీ బాక్స్ లు అందించటం అభినందనీయమని తల్లాడ మండల విద్యాశాఖ అధికారి నెమ్మకంటి దామోదర్ ప్రసాద్ అన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
పదవ తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో ఎటువంటి భయాందోళనకు , ఒత్తిడికి గురికాకుండా , సమయపాలన పాటిస్తూ,  ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య అన్నారు. ట్రస్ట్ స్థాపించిన రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారు గూడెం విద్యార్థినీ,విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించిడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రమేష్ అన్నారు.  తన భార్య పేరున ట్రస్ట్ స్థాపించి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న  విశ్రాంత ఉపాధ్యాయులు పరిశ పుల్లయ్య  ఆదర్శనీయులు  అని వక్తలు అన్నారు.
ఈ కార్యక్రమంలో
ట్రస్టు సభ్యులు మహంకాళి స్వరాజ్యలక్ష్మి ,గోండ్యాల మురళీకృష్ణ, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు ,పులి వెంకటేశ్వర్లు, ఎంఎం రాజకుమారి , శారదాదేవి , సునీత, సుచరిత పాల్గొన్నారు.