పెండ్లిమడుగులో సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి

Published: Thursday March 30, 2023
* సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 మార్చి ప్రజాపాలన : రహదారి వ్యవస్థ అభివృద్ధికి సూచికగా ఉంటుందని పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండ్లిమడుగు గ్రామాభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తాను అని అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోనే పెండ్లిమడుగును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులైన రోడ్లు డ్రైనేజీ తాగునీరు వంటి కనీస అవసరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా 15 లక్షల ఎంజిఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశానని వివరించారు. మొగిలిరెడ్డి ఇంటి నుండి బందయ్య ఇంటి వరకు, గ్రామపంచాయతీ నుండి ఎం రాములు ఇంటి వరకు, భోజిరెడ్డి ఇంటి నుండి భీమయ్య ఇంటి వరకు మూడు బిట్ల సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశానని తెలిపారు. గ్రామంలో సుమారు 400 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. నా పదవీ కాలము పూర్తయ్యే వరకు గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. గ్రామాభివృద్ధే నా లక్ష్యం అని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు నేను చేసే ప్రతి అభివృద్ధి పనికి పూర్తి సహకారం అందించినారని తెలిపారు. గ్రామ ప్రజలకు సదా నేను రుణపడి ఉంటాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కామిడి చంద్రకళ ఉపసర్పంచ్ బందయ్య పంచాయతీ కార్యదర్శి సంజీవ్ కుమార్ వార్డు మెంబర్ బందయ్యా సిద్ధలూరు కాంట్రాక్టర్ ఎంపీటీసీ గౌస్ గ్రామస్థులు పాల్గొన్నారు.