నాగులపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఆత్మీయ సన్మానం

Published: Thursday March 03, 2022

కోరుట్ల, మార్చ్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి కి యూత్ ఫర్ ఆంటీ కరెప్షన్ హైదరాబాద్ సంస్థ నిజాయితీ సర్పంచులకు ఆత్మీయ సత్కారం పేరుతో కార్యక్రమాలు చేస్తూ కోరుట్ల మండలం ఉత్తమ సర్పంచుగా ఎంపికై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా అవార్డు రావడం పట్ల క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీ తోట నారాయణ మరియు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట నారాయణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నాగులపేట సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజాయితీగా నిబద్ధతతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుండి నడపటంతో పాటు యువతను గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, కోరుట్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పవన్, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు