యూరియా మాయం ఆవాస్తం ఇన్స్పెక్టర్ ఏ శంకర్.

Published: Monday July 25, 2022
పాలేరు జూలై 24 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం  జిల్లా నేలకొండపల్లి
మండల పరిధి లోని రాజేశ్వరపురం సోసైటీ లో యూరియా మాయమైన్నట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని విచారణాధికారి ఏ.శంకర్ తెలిపారు.
సోసైటీ ఉపాధ్యాక్షుడు అడపాల రవీందర్ సోసైటీలో 118 యూరియా బస్తాలు మాయమైన్నట్లు డీసీవో కు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. స్పందించిన డీసీవో సీనియర్ ఇన్స్పెక్టర్ ఏ.శంకర్ ను విచారణ కు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సొసైటీ లో విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. గోడౌన్లో స్టాక్ ను తనీఖీ చేశారు. ఏప్రిల్ 1. 2022 నుంచి 23 జూలై 2022 వరకు సోసైటీ కి మొత్తం 6474 యూరియా బస్తాలు వచ్చాయి. అందులో 5588 బస్తాలు రైతులకు విక్రయాలు | నిర్వహించగా. ప్రస్తుతం రికార్డుల ప్రకారం 886 బస్తాలు గౌడోన్లో నిల్వ ఉన్నట్లు నిర్ధారించారు. ఎరువుల మాయం అవాస్తమని పేర్కొన్నారు. తన నివేదిక ను డీసీవో కు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
 
సీఈవో యం.వీరబాబు, సోసైటీ డైరెక్టర్ లు దండా రంగయ్య, పుసులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు