స్వగ్రామానికి చేరిన మృత దేహం

Published: Thursday September 22, 2022
జన్నారం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన: ఎన్నో అశాలతో కుటుంబాన్ని పోషించాలనే గల్ఫ్  ఒమన్ సలాలకి వేళ్లి  మండలంలోని మురిమడుగు వాసి కొండ రాజన్న గుండె పోటుతో వారం రోజుల మృతి చెందడం జరిగిందని బుధవారం స్వాగ్రామం చేరిందని మురిమడుగు గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు పూడూరి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఎర్పాటు చేసిన మాట్లాడుతూ  బ్రతుకు దేరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లి చనిపోవడం తోటి అతని కుటుంబం అర్తికంగా వీదిన పడింది, స్థానికులు కన్నీరు మన్నీరుగా వీలపించారు. మరణించిన కొండ రాజన్న కు భార్య సత్తవ్వ ఇద్దరు కుమారులు, ఒక కుతూరు ఉన్నారు.ఒమన్ దేశంలో కొండ్ర రాజన్న చనిపోయిన రోజు నుండి మృతి దేహం వెంటే ఉంటూ తోటి గల్ఫ్ కార్మికుడైన మురిమడుగు గ్రామవాసి పడిగెల రాజన్న  మృతి దేహంతో ఇంటికి తీసుకువచ్చే వరకు వెంటే వచ్చాడు. అతని సహకారం, కృషి ఎనలేనిదని అన్నారు. మురిమడుగు గల్ఫ్ అసోసియేషన్ సభ్యుడు పందిరి రవి మాట్లాడుతూ 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 8 ఏళ్ల క్రితం తమ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు,ఐదు వందల కోట్ల రూపాయలుతో ఎన్నారై పాలసీ (ఎన్అర్ఐ పాలసీ) ప్రకటిస్తామని మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ కుటుంబాన్ని ఆదుకున్న సందర్భాలు పోలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి. చనిపోయిన గల్ఫ్ కార్మికుడు కొండ్ర రాజన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పూడూరి సతీష్, పడిగెల రాజన్న, పందిరి రవి, చిట్యాల చంద్రయ్య, సాకపురం శంకర్, ఆసంపేల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area