గల్ఫ్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

Published: Tuesday October 04, 2022
జన్నారం, అక్టోబర్ 03,  ప్రజాపాలన: గల్ఫ్ ఒమన్ సలాలలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామం వాసి  కొండ్ర రాజన్న గుండె పోటుతో ఇటివల మృతి చెందడం జరిగిందని, మృతి చెందిన కుటుంబానికి మురిమడుగు గల్ఫ్ అసోసియేషన్ ఆద్వర్యంలో సోమవారం ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని గల్ఫ్ గ్రామ అధ్యక్షుడు పూడురి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతి చెందిన అతనికి భార్య సత్తెవ్వ ఇద్దరు కుమారులు,  ఒక కుమార్తె  ఉన్నారు, అతని కుటుంబం చాలా  నిరుపేద కుటుంబం వారున్నారు. ఈ సందర్భంగా మురిమడుగు గల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థపకులు పందిరి రాజు పూడూరి సత్తీస్ గల్ఫ్ యూనియన్ సభ్యులు అందరూ ముందుకు వచ్చి రూ,2, 6400/- కొండ్ర రాజన్న కుటుంబానికీ ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా  వ్యవస్థపకుడు పందిరి రాజు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 8 ఏళ్ల క్రితం తమ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కుటుంబాల కొరకు, ఐదు వందల కోట్ల రూపాయలు తో (ఎన్నారై పాలసీ) ప్రకటిస్తామని మాట ఇచ్చాడు, కానీ ఇప్పటివరకు ఏ కుటుంబాన్ని ఆదుకున్న పోలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి. గల్ప్ లో చనిపోయిన గల్ఫ్ కార్మికుడు కొండ్ర రాజన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థపకుడు పందిరి రాజు అధ్యక్షుడు పూడూరి సతీష్, పందిరి రవి, లచ్చన్న గౌడ్, ఆశంపేల్లి రవి,
సాకపురం శంకర్, దండెం గంగరాజం, జాగుడాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.