జర్నలిస్టు బృంగి శశివర్ణం చిత్రపటానికి నివాళులు

Published: Saturday May 08, 2021
బాలపూర్, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చలో ఢిల్లీ  కార్యక్రమంలో కొట్లాడిన గొప్ప ఉద్యమ వీరుడు భృంగి శశివర్ణం, జర్నలిస్టులకు చిన్న ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించే వారని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు భృంగి శశివర్ణం కరోనా మహమ్మారి తో పోరాడి మృతి చేందాడు..... మహేశ్వరం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భృంగి శశివర్ణం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహేశ్వరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు..... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమం లో కొట్లాడిన గోప్ప ఉద్యమ వీరుడు భృంగి శశివర్ణం అని కొనియాడారు... ఏ జర్నలిస్టులకు చిన్న ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించేవారు.... వార్తా సేకరణ విధి నిర్వహణలో బాగంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నా జర్నలిస్టులు అనేకమంది కారోన (covid-19) బారినపడి మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ సెంటర్లు కో వ్యాక్సినేషన్ సెంటర్లు వేంటనే ఏర్పాటు చేయాలని విధి నిర్వహణ ప్రతి జర్నలిస్టు మాస్కులు, శానిటైజర్ వాడి సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులను కోరారు... ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా సీనీయర్ వార్త రిపోర్టర్ వత్తుల రఘుపతి, రంగారెడ్డి జిల్లా టేంమ్జూ కమిటీ ఈసీ మేంబర్ మునగాల రాఘవేందర్ చారి, టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు కోటగళ్ల రాజ్ కుమార్, గంజీ వేంటేష్, పులిజాల హేమంత్ గౌడ్, బంటు వెంకటేష్, సుమన్, సాయి, పార్లకుర్ల  వేంకటేష్ గౌడ్, ప్రశాంత్, ప్రవీన్ కూమర్, రాము, నర్సింహ్మ, దిల్లిప్,  తదితరులు పాల్గోన్నారు.