పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన మేయర్

Published: Thursday September 02, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 1, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించిన కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 13వ డివిజన్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మారి స్వచ్చంద సంస్ధ, బాలాపూర్ వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కార్యక్రమాన్ని ముఖ్య అతిథి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి నివారణకు టీకాను తప్పక వేసుకోవాలని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అక్కడి బాలాపూర్ పాఠశాలలో పర్యటించి పాఠశాలకు హాజరైన పిల్లలతో కాసేపు ముచ్చటించారు. సానిటేషన్ చేయించాలని పిల్లలకు అవగాహన కల్పించి భౌతిక దూరం పాటించేలా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సానిటేషన్ సిబ్బందికి ఎప్పటికి అప్పడూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహార్, నేనావత్ బాలు నాయక్, కో ఆప్షన్ సభ్యులు రఘునందన చారి, ఖలీల్ పాషా, మాజీ సర్పంచ్ బొర్ర జగన్ రెడ్డి, మారి సంస్థ ప్రతినిధి వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చైతన్య కృష్ణ, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.