బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి నందు

Published: Friday December 16, 2022
 ఐటిడిఏ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజలు ఉపయోగించుకోగలరు.బూర్గంపాడు (ప్రజా పాలన.)
బూర్గంపహాడ్ మండల ప్రజల కు 
ఐటిడిఎ- భద్రాచలం వారి సహకారంతో
వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక వైద్య నిపుణుల చే, 16.12.2022 అనగా శుక్రవారం ఉదయం 10 గ. నుండి మ. 3 గ. వరకు ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించ బడును. ఈ వైద్యశిబిరం నందు
ఎంతో అనుభవం కలిగిన స్త్రీలవైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, దంత 
వైద్య నిపుణులు, శస్త్ర చికిత్స నిపుణులు,
సాధారణ వైద్యనిపుణులు, మరియు
కీళ్లు,ఎముకల వైద్యనిపుణులు పాల్గొనేదరు. 
అదేవిధంగా అవసరమైన గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయబడును. అలాగే అన్నీ రక్త పరీక్షలు  కూడా చేయబడును.ఈ వైద్య శిబిరమునకు వచ్చిన వారందర్ని పరీక్షించి, అవసరాన్ని బట్టి ఉచితంగా మందులు ఇవ్వబడును.
కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ
ఉపయోగించు కోవాలని కోరుచున్నాము. అని బూర్గంపాడు వైద్యులు తెలిపారు.