నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థినికి ల్యాప్టాప్ మరియు ఆర్థిక వితరణ

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : కలకత్తాలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతూ ఖమ్మం సమీపానగల కొత్తూరు గ్రామ విద్యార్థిని రావు ఝాన్సీయొక్క ఆర్థిక పరిస్థితి ఆన్ లైన్ పరీక్షలు వ్రాయటానికి పడుతున్న ఇబ్బందిని తెలుసుకున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ చొరవతో ఖమ్మం నందు గల జీ.వి మాల్ యజమాని సీతా మహాలక్ష్మి గారు మరియు చేతన ఫౌండేషన్వారి ఆర్థిక సహకారంతో ముప్పై నాలుగు వేల రూపాయల విలువ చేసే లాప్టాప్ మరియు వీరి మిత్రుల ఆర్థిక సహకారంతో ఐదువేల రూపాయలు నగదు విద్యార్థిని ఝాన్సీకి ఇచ్చునట్లుగా కృషి చేసినారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై.ప్రభాకర్ నిరుపేద ప్రతిభ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకుగాను ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్ చాంద్ పాషా, సుగ్గల రామకృష్ణారావు, షేక్ శంషుద్దీన్, మేడేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లాప్టాప్ మరియు ఆర్థిక సహకారం అందించిన దాతలకు విద్యార్థిని ఝాన్సీ కృతజ్ఞతలు తెలియజేశారు.