మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి పయనం

Published: Monday June 28, 2021
చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్, జూన్ 27, ప్రజాపాలన బ్యూరో : కొద్ది రోజుల క్రితం మార్నింగ్ వాక్ చేస్తుండగా అనుకోకుండా స్లిప్ అయి ప‌డ‌టంతో నా ఎడమ కాలు బెణికిందని చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గాయం కాస్త పెద్దదిగా మారి న‌న్ను ఇబ్బంది పెట్ట‌డంతో వైద్యుల‌ను సంప్ర‌దిస్తే, కాలుకు పట్టి వేసి నెల రోజుల పాటు కాలు కదపకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. మ‌ళ్ళీ మొన్న లిగ‌మెంట్ టేర్ టెస్టు చేసిన త‌ర్వాత మ‌రొక వారం పూర్తిగా రెస్టు తీసుకోవాలని సూచించారు. లేనిప‌క్షంలో నొప్పి తీవ్రత మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నేను స‌రైన ఫిజియోథెరిపి చికిత్స పొందుతున్నాను. ఈ క్లిష్ట స‌మ‌యంలో వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఈ నెల 27వ తేదీ(ఆదివారం) నుండి పది రోజుల‌ పాటు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ప్ర‌త్య‌క్షంగా హాజరు కాలేక పోతున్నందుకు చింతిస్తున్నాను. కానీ, ఎవ్వ‌రికి ఏ ఆప‌ద‌, అత్య‌వ‌స‌రం వ‌చ్చినా వెంటనే ప‌రిష్క‌రించేందుకు ముందుంటానని సవినయంగా పేర్కొన్నారు. నేను ప్రత్యక్షంగా అందుబాటులో లేకున్నా ఎంపి కార్యాలయ సిబ్బంది మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. ద‌య‌చేసి, ఈ విష‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌న్నించ‌గ‌ల‌రని వేడుకుంటున్నాను.