వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయం..

Published: Friday July 08, 2022
సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి..
 
 తల్లాడ, జులై 7 (ప్రజాపాలన న్యూస్): బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తూ ప్రజలకు అనేక సేవలందించిన వెంకటేశ్వరరావు  సేవలు అభినందనీయమని కుర్నవల్లి సహకార సొసైటీ చైర్మన్ ఐలూరి ప్రదీప్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఐలూరి లక్ష్మి కొనియాడారు. కుర్నవల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో క్యాషియర్ గా పని చేస్తూ పదోన్నతిపై అసిస్టెంట్ మేనేజర్ గా తమిళనాడు వెళ్తున్న అరిగెల సాయి వెంకటేశ్వరరావును గురువారం వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా  కుర్నవల్లి ఐఓబిలో ఖాతాదారులకు మంచి సేవలు అందించి  ప్రజల   మన్నలన  పొందారన్నారు. అనంతరం అయిలూరి  చిన్నకృష్ణా రెడ్డి, అయిలూరిశేషి రెడ్డి, రామ సత్యనారాయణ రెడ్డి ,  కట్ట కృష్ణారావులు శాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్  సిలీవేరు రాంబాబు, అయిలూరి కృష్ణారెడ్డి గుర్రాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.