బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలి

Published: Thursday July 07, 2022
దళిత నాయకులు
 
భద్రాద్రి కొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో)భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 36 వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తెలంగాణ మాదిగ దండోరా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాట్లాడుతూ....స్వతంత్ర సమర యోధుడిగా,కార్మిక శాఖ మంత్రిగా,వ్యవసాయ శాఖ మంత్రిగా,హోం శాఖ మంత్రిగా,ఉపప్రధానిగా ఉంటూ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ,హక్కుల్ని కాపాడుతూ... రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్చించిన రిజర్వేషన్ల హక్కులను ఆయన ఏ శాఖలో పనిచేసిన ఆయా శాఖల్లోని ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు హక్కులు అమలయ్యే విధంగా కృషి చేశారన్నారు.అటువంటి బాబు జగ్జీవన్ రామ్కి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు జగ్జీవన్ రాం 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.*ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు,దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చాట్ల రవికుమార్,బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం మండల అధ్యక్షులు గాడిద సూర్యం,చాట్ల లక్ష్మణ్,మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నండ్ర రాజు,విస్సంపల్లి ముత్యం తదితరులు పాల్గొన్నారు