రాజీవ్ కాంప్లెక్స్ ను కాపాడాలని కాంగ్రెస్ర నిరసన దీక్ష .

Published: Friday November 18, 2022
బెల్లంపల్లి , నవంబర్ 17,  ప్రజా పాలన ప్రతినిధి: 
 
 మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిర్మించిన రాజీవ్ కాంప్లెక్స్ దుకాణాల సముదాయం తమదంటే, తమదని, వాటిని కాపాడు కోవడానికి  ఆ దుకాణ సముదాయంలో ని   వ్యాపారులు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సహితం నిరసన దీక్ష చేపట్టడం బెల్లంపల్లిలో చర్చనీయాంసమైంది.
గత 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు చేసే క్రమంలో , రోడ్డు వెంబడి ఉన్న చిన్న చిన్న టేలాలు, రేకుల షెడ్లలో ఉండే వ్యాపారస్తుల దుకాణాలు రోడ్డు వెడల్పు లో పోగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థలమ్, ప్రధాన  రహదారికి రావడంతో, దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయా స్థలంలో తొమ్మిది వ్యాపార సముదాయాలను నిర్మించి  అద్దెకిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటుండగా, దుకాణాలు కోల్పోయిన వారు ఆ స్థలం కూడా తమదేనని రూములు కూడా మేమే నిర్మించుకున్నామని అవన్నీ మా పేరున్నే  మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు మా పేరు తోనే   చెల్లిస్తున్నా మని, వ్యాపారులు  అంటున్నారు.
తమయే దుకాణాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు  దుకాణ యాజమానులను బయటకు పంపించి తాళాలు వేయగా, రెండవ రోజు దుకాణాల యజమానులు తాళాలు పగులగొట్టి వీరు తాళాలు వేయగా గురువారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకమై దుకాణా సముదాయాలకు ఉన్న పేర్లను తుడిచివేసి, షెటర్లకు తాళాలు వేయకుండా డైరెక్ట్ వెల్డింగ్ మిషన్లతో వెల్డింగ్ లు చేయించి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నిరసన దీక్షకు కూర్చున్నారు.
ఏది ఏమైనా చిలికి చిలికి గాలి వానగా మారిన రాజీవ్ కాంప్లెక్స్ వివాదం అటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దుకాణాలలో వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి, ఈ వివాదం స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారింది.