కరీంనగర్ లో ఘనంగా బీమా కోరేగావ్ శౌర్య దివాస్

Published: Monday January 02, 2023
కరీంనగర్ జనవరి 01ప్రజాపాలన రిపోర్టర్:


కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకల్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అద్వర్యం లో ఘన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మేడి మహేష్ మాట్లాడుతూ 1818 సంవత్సరంలో పిష్వా సైన్యంపై దళిత మహర్లు యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న సందర్భంగా భీమా కోరేగావ్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. జనవరి 01  తారీఖున రాత్రింబవళ్లు ఈ యుద్ధం జరిగిందని, ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం లోని 500దళిత మహర్లు ఈ యుద్ధంలో 28 వెయ్యిల పీస్వా బ్రాహ్మణ సైన్యంను ఊచకోత కోసి 500 దళిత మహర్లు విజయం సాధించారు .ఈ యుద్ధంలో 47 మంది దళిత మహర్లు వీరమరణం పొందారు. వారికి చిహ్నంగా బ్రిటిష్ ప్రభుత్వం బీమా కోరేగావ్ స్థూపాన్ని నిర్మించారు. చరిత్రలో మైలురాయిగా నిలిచింది జనవరి 01న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  పూర్వ దళిత మహర్ల ధైర్య సాహసాలను కొనియాడుతూ  ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున భీమా కోరేగావ్ స్తూపం వద్ద వారికి నివాళులర్పించి ఆ రోజు మొత్తము అక్కడే గడిపేవారని, అందుకే ఈ దళిత మహర్ల చరిత్ర విజయం ప్రపంచానికి తెలిసిందని ప్రతి సంవత్సరం నూతన సంవత్సర సంతోషాన్ని ఈ యొక్క బీమా కోరేగావ్ చరిత్రను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లూ మేడి మహేష్ తేలిపారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకుడు దళితరత్న మేడి రాజావీరు, మామిడిపల్లి బాపయ్య, మేడి మహేష్, మొగరం రమేష్, సుంచు లత శ్రీ,  ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబారి కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్, శంకరపట్నం మండల అద్యక్షుడు గొట్టే అర్జున్, మండల ప్రదాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి, పారునంది జలపతి, దళిత సంఘాల నాయకులు పాటాకుల భూమయ్య, కుతాడి శివరాజు గంట మహేందర్ , నిజాంపేట శ్రీనివాస్ ,జక్కన్న పెళ్లి గణేష్ , గోపాల భూషణ్ రావు, రామ్ చందర్, సముద్రాల సదానందం,తాళ్లపెల్లి మహేష్,సముద్రాల ప్రవీణ్ ,గోదారి లక్ష్మణ్ తదితరులు పల్గొన్నారు.