కష్టమొచ్చి నప్పుడు మీకు అండగా ఉంటాం : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Published: Friday September 24, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 23, ప్రజాపాలన : మీ కష్టమొచ్చి నప్పుడు అండగా ఉంటామని కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నస్పూర్ మహిళలకు బరోసా ఇచ్చారు. గురువారం మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పురపాలక సంఘం పరిధిలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో చేపట్టిన బతుకమ్మ కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నస్పూర్  మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 7, 9, 16, 17వార్డులలోని మహిళలకు చీరలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల పాటు నస్పూర్ మున్సిపాలిటీలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే జిల్లా లో రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ లో బారీగా సభ్యులను బాగస్వామ్యం చేయగా సభ్యత్వం కలిగిన మహిళలకు గుర్తింపుకార్డులను అందజేశారు. ఆ కార్డు ఆధారంగా బతుకమ్మ చీర కానుకలను అందజే స్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికే 82 వేల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయడానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలు సన్నాహాలు చేయగా జిల్లా కేంద్రంలో మంగళవారం లాంచనంగా ప్రారంభించారు. ట్రస్టులో సభ్యులు కాని మహిళలు తమకు చీరలు కావాలంటూ దరఖాస్తు చేసుకోవడంతో వారికి కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మరో ఏడేళ్లు చీరలను పంపిణీ చేస్తామని మహిళలకు  భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గ ఇచ్చిన మాట తప్పే వ్యక్తిత్వం కాదని అన్నారు. అదేవిధంగా కరోన సమయంలో నియోజకవర్గంలోని ప్రజలకు మాస్కులు పంపిణీ చేయగా, కరోన నియంత్రణ ఇంజక్షన్ లు ఇప్పిం చినట్లు తెలిపారు. వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చడంకోసం ట్యాంకర్ల ద్వారా నీటి సరపరా చేసిట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, కౌన్సిలర్లు తెనుగు లావణ్య దేవేందర్, మహిళా నస్పూర్ పట్టణ అధ్యక్షురాలు అడెపు శ్యామల, నాయకులు దేవేందర్, చంద్రయ్య, అంగడి రాజేష్, మారు మల్లయ్య, రావి కిషన్, వనపర్తి రాజేష్, చిలుక మల్లేష్, కూర్మిళ మహేష్, నరిగే నరేష్, అత్కపురం సతీష్, దారవేని తిరుపతి, మహిళ నాయకురాళ్లు యశోద, అనూష, రాజేశ్వరి, పద్మ, లక్ష్మీ, హేమలత, కళావతి, సతమ్మ, స్రవంతి, శైలజ, పల్లవి, తదిత రులు పాల్గొన్నారు.