ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కృష్ణన్న

Published: Friday December 02, 2022
జన్నారం, డిసెంబర్ 01 ప్రజాపాలన: మలిదశ తొలి అమరుడు పోలీస్ కృష్ణన్న ముదిరాజ్ 13వ సంస్కరణ దినమును మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మండల ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో పోలీస్ కృష్ణయ్య  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ కిష్టయ్య సంస్కరణ గోడపత్రాలను మండల ముదిరాజ్ మహాసభ సమక్షంలో విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు దండవేణి చంద్రమౌళి ముదిరాజ్, మంచిర్యాల జిల్లా ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఐలవేణి నరసయ్య ముదిరాజ్ మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కొరకు పోరాడి మొట్టమొదటిగా ఆత్మ బలిదానం చేసుకొని అమరుడైనటువంటి పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కృష్ణన్న పేరు మీదుగా బహుమతులు ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కృష్ణన్న ముదిరాజ్ వర్ధంతిని నిర్వహించాలని, అమర వీరుల చరిత్ర అందరికీ తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని పోలీస్ కృష్ణయ్య మరణమే కాకుండా, రాష్ట్రంలో మరెందరో ఉద్యమధారులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం హమరులైన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్, విగ్రహాంను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో పొన్కల్ మత్స్య కార్మిక సొసైటీ ఉపాధ్యక్షుడు సిరివేని పెద్దిరాజు ముదిరాజ్, డాగే భీమరాజు ముదిరాజ్, సింగసాని సంతోష్ ముదిరాజ్, సిరివెేని కిషన్ ముదిరాజ్, నాగుల రాజన్న ముదిరాజ్, పంబాల అర్జున్, పబ్బతి రాజేశం ముదిరాజ్, మిర్యాల కుమార్, పుట్టకొక్కుల వెంకటేష్, జన్నారం మండల ముదిరాజ్ నాయకులు పాల్గన్నారు.