కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహాయమంత్రి బి ఎల్ వర్మ కి వినతి పత్రం ఇచ్చిన ఇండ్ల స్థలాల

Published: Tuesday January 24, 2023
:  పినపాక నియోజకవర్గం పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూములు కట్టించి ఇవ్వాలని, గోదావరి ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతంలో శాశ్వత గృహ నిర్మాణాలను చేపట్టాలని కోరుతూ 22-01-2023 ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో   కేంద్ర సహాయ మంత్రి బి ఎల్ వర్మ  కి  సారపాక లోవినతి పత్రం అందజేసిన న్యూ డెమోక్రసీ ఎమ్మెల్ నాయకులు..
2022 జూలై 17న ముఖ్యమంత్రి  భద్రాచలం వచ్చి గోదావరి ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చియున్నాడు. అట్టి హామీని అమలు పరిచే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీలకు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి హామీని కూడా నెరవేర్చాలని కోరారు. 160 రోజులుగా బూర్గంపాడు మండలంలోని మణుగూరు సారపాక అడ్డరోడ్డులో నిరసన దీక్ష చేపడుతున్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం తక్షణమే భూమి కేటాయించాలని ఈ వినతి పత్రంలో కోరారు. ఆదివాసీలపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్న దాడులను వెంటనే అరికట్టాలని కూడా కోరారు. కేంద్ర సహాయ మంత్రి గా ఆదివాసీ దళిత ఇతర పేదల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరారు. అనంతరం మంత్రి బి ఎల్ వర్మ  సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి పరిస్కారం దిశగా ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో  సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు భద్రాచలం సబ్ డివిజన్ నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ నాయకులు సున్నం భూలక్ష్మి, బండ్ల మునెమ్మ,  ముత్యాల సత్యనారాయణ, కొమరం భద్రమ్మ, పొడిమి రాధ తదితరులు పాల్గొన్నారు.