ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి **చేసిన అభివృద్దిని చెబుతూ చేయాల్సిన పనులను త

Published: Friday March 03, 2023

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 40వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  గురువారం ఉదయం తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో ఎమ్మేల్యే ఆధ్వర్యలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ.ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.  ప్రగతి నివేదన యాత్ర జనవరి 22న నందివనపర్తి గ్రామంలో ప్రారంభమై.నేటివరకు 2మున్సిపాలిటీలు, 3 మండలాలు, 39 రోజులు, 69 గ్రామాలు, 517కిలోమీటర్లు పూర్తి. ప్రశాంత్  కుమార్ రెడ్డి  గ్రామంలో పాదయాత్ర చేస్తున్న సంధర్బంలో శ్రీసాయినగర్ కాలనీలో శిర్డి సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలతో కలిసి బంటి  ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామివారిఆశీస్సులుతీసుకున్నారు.తుర్కయాంజల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి సహకారంతో మర్రి మణెమ్మ విమెన్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సుమారు 160మంది మహిళలు కుట్లు, అల్లికలు  బ్యూటీషన్ శిక్షణ పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ సర్టిఫికేట్ కోర్సు పూర్తైన  మహిళలు వారు స్వంతంగా కుట్లు, అల్లికలు మరియు బ్యూటీ పార్లర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రగతి నివేదన యాత్రలో భాగంగా ఈరోజు మద్యాహ్నం మునగనూర్ క్యాంపు వద్ద ఉన్న బంటి ని సొసైటీ సభ్యులు, ట్రైనింగ్ పొందిన మహిళలు కలిసి.. మాకు సహయం చేస్తే కుట్టు మిషన్లు మరియు బ్యూటీ పార్లర్స్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతామని బంటిగారిని అడిగారు. బంటి గారు స్పందిస్తూ.... ప్రగతి నివేదన యాత్ర పూర్తైన తర్వాత మీఅందరిని మరోసారి పిలిపించుకొని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని, ఏవిధమైన సహయం చేస్తే మీకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయో ఆలోచన చేసి, ఈనియోజకవర్గంలో మహిళ సాధికారత పెంపొందించటం కోసం మీకు తప్పకుండా సహయం చేస్తానని హమీ ఇచ్చారు. ప్రగతి నివేదన యాత్రలో బీఆర్ఎస్ పార్టీ తుర్కయాంజల్ మున్సిపల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మా రెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మా రెడ్డి, కౌన్సిలర్స్ వేముల స్వాతి, తాళ్లపల్లి సంగీత, మోహన్ గుప్త, వార్డు అధ్యక్షులు శివకుమార్, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ , నక్క స్రవంతి రమేష్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.