ఎబ్బనూరులో డ్రైనేజీ విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

Published: Saturday July 30, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజా పాలన : డ్రైనేజీ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూరు గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డితో కలిసి వీధి వీధి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పాడు బడ్డ ఇళ్లను, పిచ్చి మొక్కలు వెంటనే తొలగించాలని సూచించారు. శానిటేషన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబి స్విచ్ ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లు మరో ప్రదేశానికి మార్చాలన్నారు. గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను, స్థంభాలను సరిచేయాలని పేర్కొన్నారు. అవసరమైన చోట నూతన స్థంభాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ నల్లాలకు ట్యాప్ లు కచ్చితంగా బిగించాలని వెల్లడించారు.  ఎవ్వరు కూడా చెర్రలు తీసివేయరాదని హితవు పలికారు. మిషన్ భగీరథ నీటిని త్రాగాలని అందుకు అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. నెలకు మూడు సార్లు కచ్చితంగా నీటి ట్యాంక్ లను శుభ్రం చేయాలని, మిషన్ భగీరథ అధికారులను పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వర్షాకాలం సమీపించిన సందర్భంగా గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనారోగ్యాలకు గురికారాదని ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో ఉంచాలని బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసిన కార్మికులకు, పూర్తి స్థాయిలో పనిచేసిన వారికి డబ్బులు వారి వారి అకౌంట్ లలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎబ్బనూర్ ప్రభుత్వ  పాఠశాలను అంగన్ వాడి సెంటర్ ను సందర్శించి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి బోధన విధానం మరియు పాఠశాల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం మండల యూత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ గ్రామస్తులు శ్రీనివాస్ గౌడ్ శశిధర్ రెడ్డి ప్రశాంత్ వంశి గౌడ్ గోపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.