*మున్సిపాలిటీలోబీజేపీ లో చేరిన 15 కుటుంబాలు*

Published: Monday February 13, 2023

మధిర ఫిబ్రవరి 12 ప్రజాపాలన ప్రతినిధి
 మధిర ముస్లిం కాలనీ లో ఎస్.కెజానీ అధ్యర్యంలో 15 కుటుంబల నుండి బీజేపీ లోకి చేరిన స్థానిక ముస్లిం కుటుంబాలు,
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ పధకాలు నీతి నిజాయతి తో కూడిన పరిపాలన నచ్చి ఈరోజు బీజేపీ లో చేరటం జరిగింది.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు, మధిర లో ముస్లిం కాలనీ ఏర్పాటు అయినప్పుడు కాలనీ ఎలా ఉందొ నేటికీ ఎలాంటి అభివృద్ధి లేకుండా, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక, వర్షం వస్తే నాలుగు అడుగుల లోతు నీళ్లలో రోజులు తరబడి నివాసం చేస్తున్న ఇక్కడి ప్రజల బాధలు, వర్ణనతీతం, కనీసం రేషన్ బియ్యం తెచ్చుకోవటానికి,2కిలోమీటర్లు పరిధిలో ఉన్న,బంజార కాలనీలో ఉన్న రేషన్ షాప్ కు రావటం కోసం వాళ్ళు పడే బాధలు, ఇక్కడ నాయకులు కు ఎందుకు పట్టం లేదు, ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి తరువాత మర్చిపోవడం పరిపాటిగా మారిపోయింది, మధిర మున్సిలిటికి గతంలో మంత్రి కే,టీ ఆర్, మధిర కు వచ్చి 16 కోట్లు ఇచ్చాము అన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి, కే సి ఆర్,30 కోట్లు, మొత్తం 46కోట్ల తో మధిర లో అన్ని వార్డుల్లో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలి, కానీ జరగటం లేదు, మరి 46కోట్ల రూపాయలు నిధులుతో ఎక్కడ అభివృద్ధి చేసేరో లెక్కలు చెప్పాలి లేదంటే, ఎవరి జేబులోకి పోతున్నాయి, అని బీజేపీ ప్రశ్నిస్తుంది,బీజేపీలోకి జాయిన్ అయిన వాళ్ళు ఎస్.కెజానీ, షేక్ మౌలాలి, ఎండి మహ్మద్, ఎస్.కెబాజీ, ఎస్.కె దస్తగిరి, ఎస్.కె సుభాని అలీమ్,సుభాని,  నాగేంద్రబాబు, ఎస్.కె నజీర్, అంజు, బాజీ, నాజీ, ఆర్ మినకుమారి, తదితరులు బీజేపీ లోకి చేరటం జరిగింది,బీజేపీ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు,జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, ఉపాధ్యక్షులు పెరుమాళ్ళపల్లి మోహనరావు, యువమోర్చ, కుక్కల రాము,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.