పటోళ్ల కౌశిక్ రెడ్డి సహాయ సహకారాలు ప్రజలకి ఎల్లప్పుడూ ఉండాలి

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజా శ్రేయస్సు కొరకు నిరంతరం పోలీస్ సిబ్బంది డ్యూటీ లో ఉన్నందుకు మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు శివరాం రెడ్డి చేశారు. బాలపూర్ మండలం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ విధినిర్వహణ లో వున్న వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని శివరాం రెడ్డి తన స్నేహితులతో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో చేశారు. శివరాం రెడ్డి మాట్లాడుతూ..... లాక్ డౌన్ విధించిన అప్పటి నుండి ప్రతి రోజు పటోళ్ల కౌశిక్ రెడ్డి గారి సహకారంతో 150 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి, రోడ్లపై నిద్రిస్తున్న యాచకులు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసి లాక్ డౌన్ లో ఎక్కడ పోకుండా ఉండే వారికి అందజేశారని చెప్పారు. లాక్‌డౌన్‌ లోనే తన జన్మదినోత్సవం రావడంతో అట్టి జన్మదినోత్సవాన్ని పూర్తిగా రద్దు చేసుకొని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ అలసట లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్న మీర్ పేట్ పోలీస్ వారికి మంగళవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, డిఐ సత్యనారాయణ, ఎస్ఐ అనంత రాములు, ఎస్ఐ వెంకటరెడ్డి, ఎస్ ఐ మారయ్య, ఎస్ఐ ఉదయభస్కర్, తెరాస నాయకులు జిల్లెల ప్రభాకర్ రెడ్డి, ఎస్.సాంబశివ, చిత్రం సాయికుమార్, తీగల సతీష్, భరత్ కుమార్, పూర్ణ చందర్ రెడ్డి, సుజిత్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.