మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Published: Tuesday June 15, 2021
కోరుట్ల, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆద్వర్యంలో జూన్ 14, ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక వాసవీ కళ్యాణ భవనములలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు లయన్ మంచాల జగన్ మాట్లాడుతూ కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులలో జగిత్యాల జిల్లా కేంద్రం లోని రక్తనిధి కేంద్రంలో రక్త నిలువలు లేకపోవడంతో ప్రసూతి నిమిత్తం గర్భిణీ స్త్రీలు, ప్రమాదాల బారిన పడినవారికి సరియైన స్థలంలో, సరియైన సమయంలో రక్తం దొరకక మృత్యువాతకు గురవుతున్నారని అందుకే ఈ రక్తదాన శిబిరం నిర్వహించామనీ, రక్తదానం మానవత్వం పరిమలించిన స్వచ్ఛంద రక్తదాతల ద్వారానే దొరుకుతుందనీ ప్రపంచంలో ఇంతగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ రక్తం ఏ శాస్త్రవేత్తా తయారు చేయలేడనీ అన్నారు. కాగా ఈ మెగా రక్తదాన శిబిరం లో కోరుట్ల పట్టణం మరియు పరిసర గ్రామాలకు చెంది‌న 65 మంది రక్తదాతలు పాల్గొనగా 42 మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతలకు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల పక్షాన రక్తదాన ప్రశంసా ప్రత్రాలను అందించారు. సన్మాన గ్రహీతలు కట్కం గణేష్, వాసాల గణేష్, జాల వినోద్, సనావుద్దిన్, పుప్పాల నాగరాజు, రుద్ర విష్నేష్, సాడిగ మహేష్, అతీక్, ఆమెర్, పంచిరి విజయ్ కుమార్, జిల్ల మణిరాజ్, ఫసియొద్దిన్, ఆనంద్, శేఖర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు లయన్ మంచాల జగన్, రీజియన్ చైర్మన్ లయన్ అల్లాడి ప్రవీణ్,కార్యదర్శి లయన్ కొమ్ముల జీవన్ రెడ్డి, కోశాధికారి లయన్ గుంటుక మహేష్, వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డాక్టర్ గండ్ర దిలీప్ రావు, జిల్లా నాయకులు లయన్ గుంటుక చంద్ర ప్రకాష్, లయన్ ఆడెపు మధు, లయన్ చాప కిషోర్, లయన్ దండంరాజ్ స్వరాజ్, చలిగంటి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.