ప్రతి డివిజన్లో కరోనా టీకా పై అవగాహన కల్పించాలి

Published: Tuesday September 21, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ పరిధిలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ 31వ, 1వ డివిజన్ లలో ఉచిత కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. అనంతరం ఆమె మాట్లాడుతూ.... టీకా అందరూ తప్పక వేసుకొవాలని అన్నారు. మన కార్పొరేషన్ పరిధిలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రతి డివిజన్ లో మూడు రోజుల పాటు కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కార్పొరేటర్ వాళ్ళ డివిజన్ల కాలనీలో ప్రజలందరికీ కరోనా టీకా పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదే విధంగా 19వ డివిజన్ కార్పొరేటర్ రామోజీ అమిత శ్రీశైలం చారి, కాలని అసోసియేషన్ వాళ్లతో కలిసి కార్పొరేషన్ మేయర్  గాయత్రి హిల్స్ కాలనిలో డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... కాలనీ వాసులకు ఉచిత కరోనా టీకా వేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, రామోజీ అమిత శ్రీశైలం చారి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కార్పొరేషన్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, డాక్టర్ శ్రీనివాస్, ఏ ఎన్ ఎం, సిస్టర్స్, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.