*రైతులు కేవైసీ చేయించి, మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్, -బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు అనుసంధానం చేయాల

Published: Saturday December 10, 2022

-జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి**


చేవెళ్ల,డిసెంబర్09( ప్రజా పాలన):-

రైతులు పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ ని తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి సూచించారు. శుక్రవారం నాడు చెవెళ్ళ మండలం పరిధిలోని దేవుని ఎర్రవల్లి క్లస్టర్ పరిధిలో వివిధ గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి పీఎం కిసాన్ ఈ కేవైసీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గీతారెడ్డి మాట్లాడుతూ.... రైతులందరూ ఈ కేవైసీ చేసుకోవాలని అన్నారు. ఈ కేవైసీ అనగా రైతులు వారి యొక్క మొబైల్ నెంబరు మరియు ఆధార్ సంఖ్యను బ్యాంకు అకౌంట్ కు అనుసంధానం చేసుకోవాలని దీని ద్వారా పీఎం కిసాన్ పథకంలో తదుపరి విడతలో కూడా లబ్ధి పొందగలరని తెలియజేశారు. పీఎం కిసాన్ ఈ కేవైసీ కొరకు కామన్ సర్వీస్ సెంటర్లను లేదా పిఎం కిసాన్ అధికార వెబ్సైటును సంప్రదించాలని సూచించారు. చేవెళ్ల మండలంలో ఇప్పటివరకు 13235 మంది పట్టాదారులకు ఇంకా 4272 మంది రైతులు ఈ కేవైసీ చేసుకోలేదని వీరందరూ వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాలలో పంటలను  పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో  ఏఈఓ రమేష్, ఏవో తులసి ,గ్రామాల రైతులు పాల్గొన్నారు.