వాసవి క్లబ్ సభ్యుని పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ.

Published: Monday January 17, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి15, ప్రజాపాలన : వాసవి క్లబ్ సభ్యులు పడకంటి లింగమూర్తి పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్స్  ఆధ్వర్యంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు శనివారం నిరుపేదలకు పులిహోర అన్నదానం తోపాటు మాస్కులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా పడకంటి లింగమూర్తి, పడకంటి శ్రీనివాస్ సహకరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్త శ్రీనివాస్, వాసవి క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంతుల ముఖేష్, జోన్ ఛైర్మన్ కాచం సతీష్, కొంకుముట్టి వెంకటేష్, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి నలమాసు ప్రవీణ్, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, వాసవి క్లబ్ ఇందారం క్లబ్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.