భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష

Published: Monday July 11, 2022
మంచిర్యాల బ్యూరో ,జూలై 10, ప్రజాపాలన :
 
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో  వర్ష బాబా పరిస్థితి తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పైరాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాజెక్టుల నిర్వహణ సమర్థవం తంగా  జరపాలని సూచించారు. జిల్లాలో ఉన్న పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టం కలిగిన పంచాయతీ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, ఇతర నష్టం వివరాలను సమర్పించాలని సూచించారు.  నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చూసించారు. వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలను గుర్తించి అవసరమైన మేర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 
 
* అప్రమత్తంగా అధికార యంత్రాంగం  : కలెక్టర్
 
 
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అర్జున్ గుట్ట , రాంపూర్ ల మధ్యలోని నీటి నిలువ ప్రాంతాలను  జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి
పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గొల్లవాగు, నీల్వాయి తదితర వరద పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అధికారులు అందుబాటులో ఉంటూ తీసుకోవలసిన రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250500, 08736-250501, 08736-250502, 08736-250504 లను సంప్రదించేలా విస్తృత  ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.