విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన

Published: Tuesday October 12, 2021
వికారాబాద్ బ్యూరో 11 అక్టోబర్ ప్రజాపాలన : రైతులకు విత్తన శుద్ధి, పంట అధిక దిగుబడులు సాధించడం వంటి విషయాలను అవగాహన కల్పించానని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వ్యవసాయ కళాశాల విద్యార్థి గౌండ్ల రాకేష్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా డెంగ్లూర్ తాలూకా మరికల్ గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యవసాయ కళాశాలలో బిఎస్సి అగ్రికల్చరల్ చివరి సంవత్సరం విద్యను అభ్యశిస్తున్నాడు. రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ (ఆర్ఎడబ్ల్యూఈ), అగ్రో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ (ఎఈఎ) శిక్షణ కార్యక్రమంలో భాగంగా విత్తన శుద్ధి ఎలా నిర్వహించుకోవాలో డెమో తీసుకుని రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తన ఉపాధ్యాయుల సూచనలు సలహాలతో రూరల్ అవేర్నెస్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డిగూడ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. మట్టి ద్వారా విత్తనాలకు సంక్రమించే వ్యాధుల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఆరు నెలల శిక్షణలో భాగంగా కామారెడ్డిగూడ రైతులకు అవగాహన కల్పించారు.