ప్లాస్టిక్ రహిత సమాజస్థాపనే మన లక్ష్యం : జె యస్ యస్ జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ.

Published: Tuesday July 26, 2022
బోనకల్, జులై 25 ప్రజాపాలన ప్రతినిధి: జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ముష్టికుంట్ల గ్రామాoలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగా జె యస్ యస్ సెంటర్స్ లలో ప్లాస్టిక్ నిరోధం పై అవగాహన సదస్సును నిర్వహించి లబ్ధిదారులతో పేపర్ కవర్స్ తయారు చేయించడం జరిగింది. ప్రజలందరు విధిగా పేపర్ , క్లాత్స్, జనప నారతో తయారు చేయబడిన సంచులను మాత్రమే వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక నష్టాలు వాటిల్లి జీవన ప్రమాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని, అందరు ఆరోగ్యాంగా ఉండాలని, మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,జె యస్ యస్ డైరెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో మహిళలు, యువతీ, యువకులు పాల్గొని గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయుటలో తమవంతు సహకారం అందించాలన్నారు. ప్రజలు స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలని, ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకొని స్వయం శక్తితో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని డైరెక్టర్ వై రాధాకృష్ణ అన్నారు.ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, యస్ కె. రజియా, గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area