పంచాయతీ కార్మికులకు యూనిఫాం పంపిణీ

Published: Monday October 18, 2021
బోనకల్, అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామపంచాయతీ కార్మికులకు యూనిఫాం అందజేసిన మరీదు పుల్లయ్య, గ్రోమోర్ మంద వినోదులు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ సిబ్బందికి ప్రతిరోజు వారు గ్రామంలో చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో వారికి యూనిఫాం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో దసరా పండుగ కనుక సందర్భంగా వారికి యూనిఫామ్ అందజేసినారు. అందజేసిన వారికి సర్పంచ్ మర్రి తిరుపతిరావు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ సీబ్బంది ఆశా కార్యకర్తలు ఉపసర్పంచ్ మల్లాది గంగమ్మ, బండి నాగేశ్వరరావు, పుల్లయ్య, ఆంజనేయులుతదితరులు పాల్గొన్నారు.