పేదల పెద్దకొడుకు కేసీఆర్. -అన్ని వర్గాల వారు అభివృద్ధి ధ్యేయంగా పథకాలు -ఎమ్మెల్యే కాలే యాద

Published: Thursday September 29, 2022
చేవెళ్ల, సెప్టెంబర్ 28 ( ప్రజా పాలన)

రాష్ట్రంలో ప్రతి.. పేదకుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్దకొడుకు వలె వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, పింఛన్లు,తెలంగాణ ఆడపడుచులకు ఒక అన్న వలె బతుకమ్మ పండుగలో భాగంగా చీరలను కానుకగా ఇస్తూ, పేదింటి మహిళల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.
చేవెళ్ల మండల పరిధిలోని రేగడి ఘనపూర్ గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ ని ప్రారంభించారు అలాగే చేవెళ్ల, రేగడిగానాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను,మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలక