మొడికార్మిక చట్టసవరణలనునిలుపుధల చేయాలి : ఐఎఫ్ టియు

Published: Thursday April 01, 2021
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం బిజెపి ప్రభుత్వం భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అత్యంత దుర్మార్గమని. వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ,IFTU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో p.సతీష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లొ N.సంజీవ్  మాట్లాడుతూ,లు పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020, పారిశ్రామిక వివాదాల చట్టాల స్థానంలో పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, వచ్చింది ది ఈ కోడ్ ద్వారా పాత చట్టాలలో చేసిన మార్పులు కార్మిక ప్రయోజనాలకు చాలా ప్రమాదకరమైనవి కార్మికులు యూనియన్ గా సంఘటితమై హక్కు పైనే గురి పెట్టింది యూనియన్ ని ఎంచుకునే హక్కు పైన సమ్మె చేసే హక్కు పైన ఇతర హక్కుల పైన కూడా దాడి ఎక్కుపెట్టింది సెక్షన్-2లోఉన్నపరిశ్రమ నిర్వచనాన్ని మార్పు చేసింది, అందువలన ప్రభుత్వం ఏ పరిశ్రమనైనా పరిశ్రమ కాదు అనే చెప్పే అధికారాన్నికలిగిఉంటుంది B)వృత్తి సంబంధ భద్రత ఆరోగ్యం మరియు పని నియామకాలు(OS HWC) కోడ్, 2020-ఈ కోడ్ పాత 13 చట్టాలను కలిగి ఉంది ఫ్యాక్టరీల చట్టం 1948 గనుల చట్టం 1952 డాక్ వర్కర్, (సేఫ్టీ హెల్త్ మరియు సంక్షేమం) చట్టం 1986 బి ఓ సి బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి మరియుపని,నియామకాల క్రమబద్ధీకరణ చట్టం 1996 ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ 1970 (CL RA )ఇంటర్ స్టేట్ మైగ్రంట్ వర్కర్స్ యాక్ట్ 1979 వర్కింగ్ యాక్ట్ 1958 మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ 1976 బీడీ అండ్ సిగార్ వర్కర్స్ 966 సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ యాక్ట్ 1981 ఈ కొడ్,లో ఉన్నాయి. ఈ చట్టాలను లేకుండాచేశారు. C) సామాజిక భద్రత, కోడ్ ఇందులో తొమ్మిది పాత చట్టాలను చేర్చారు అవి ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర నియమాలు చట్టం 1952 కార్మిక రాజ్ భీమా చట్టం 1948 ఎంప్లాయిస్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ యాక్ట్ 1959 మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1961 పేమెంట్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ 1972 సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1981 బిల్డింగ్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్, సేస్, యాక్ట్ 1996 అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008 ఈ పాత చట్టాలన్నీ కొత్తకోడ్ ప్రత్యేక చాప్టర్లుగా లు గా మాత్రమే మారాయి ఈ చట్టాలలోని నియమాలలో ప్రధానమైన మార్పులు ఏమీ లేవు అసలు మౌలిక ప్రశ్న ఏమిటంటే సామాజిక భద్రత ఒక హక్కుగా సర్వజనినంగ్, గా చూడాలి కానీ దానిని పట్టించుకున్న పరిస్థితి లేదు నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించి వలస కార్మికులు ఈ చట్టం ద్వారా పొందే ప్రయోజనాలను తమ సొంత రాష్ట్రంలో నైనా లేదా తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనైనా పొందవచ్చును అయితే ఆచరణలో దీనిని ఎలా అమలు చేస్తారో చూడాలి బిల్డింగ్ మరియుఇతరనిర్మాణాలలో మరొక నియమాన్ని జోడించారు అదేమిటంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయము తమ సొంత నివాసం కొరకు బిల్డింగ్ నిర్మిస్తున్నట్లు అయితే ఆ పని యొక్క విలువ 50 లక్షలు దాటినట్లయితే ప్రభుత్వం ఈ విషయంమైనిర్ణయించిన మొత్తం కంటే లేదా నిర్ణయించిన సంఖ్య కంటే ఎక్కువ మంది కార్మికులను ఉపయోగించనట్లయితే అది బిల్డింగ్ ఇతర నిర్మాణాల పరిధిలోకి రాదు ఈ నియమాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికుడు అనే నిర్వచనాన్ని మార్చి కొంత మంది కార్మికులకు సంక్షేమ ఫలాలు అందకుండా చేసే అవకాశం ఉన్నది గ్రాట్యుటీ పొందాలంటే ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కావాలని నిబంధనలను రద్దు చేశారని అభిప్రాయాన్ని కలిగించారు కానీ ఇది వాస్తవం, పాత నిబంధన ఉంది ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ విషయంలోనే గ్రాట్యుటీ పొందడానికి అర్హతను ఒక సంవత్సరం సర్వీసు సరిపోతుందని మార్చారు ఈ కోడ్ లో కూడా ఇన్స్పెక్టర్లను తనిఖీ అధికారులను ఫెసిలిటేటర్ దోహదకారులు గా మార్చారు తమపై పడిన నేరాలను నివృత్తి చేసుకునే సౌకర్యాన్ని యజమానులకు అప్పజెప్పారు
D. వేతనాల కోడ్
2019. డ్రాఫ్ట్ రూల్స్
ఈ కోడ్ ని పార్లమెంట్లో 2019లో ఆమోదించింది ఇందులో నాలుగు పాత చట్టాలను చేర్చారు, అవి వేతనాల చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాల చట్టం,1948, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతనాలు చట్టం 1976 ఈ నాలుగింటిని కలిపి వేతనాల కోడ్ గా మార్చి పాత చట్టాలను ఇందులో చాప్టర్ లాగా చేర్చారు వేతనాలకు సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ ని వేతనాల కోడ్ లో చేర్చారు, అవి gajit లో ప్రచురించిన తర్వాత చట్టంగా మారుతాయి ఒక నూతన భావనను ఈ కోణంలో ముందుకు తెచ్చారు మొత్తంగా భారతదేశంలో కార్మిక వర్గానికి బలంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్, లు గా మార్చి కార్మికుల హక్కులను కూడా కొట్టారు పైగా సమ్మె చేసే హక్కు ని నీరుగార్చి అంతిమంగా కార్పొరేట్లకు భారతదేశ సంపదను కారుచౌకగా అప్ప చెప్పేందుకు ఈ చట్టాలు అడ్డంకిగా ఉండడాన్ని మార్చారు దీన్ని కార్మికవర్గం వ్యతిరేకించాలని ఏప్రిల్ 1 నుండి ఈ నాలుగు కోడ్ లు అమల్లోకి రానున్నాయి ఈ జిల్లాలో కార్మిక వర్గం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయాలని చట్టాలు మార్చవద్దని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమం లొ సతీష్ చంద్రశేఖర్ కృష్ణ  నరసింహ కరుణ నాగలక్ష్మి విజయ్ రాధ మరియమ్మ లలిత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు