సమన్వయ ద్వయం ఎంపిడిఓ సత్తయ్య వీరకాంతం యాంకరింగ్ హైలైట్

Published: Friday January 27, 2023

వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ అధికారిక కార్యక్రమాన్నైనా రూపకల్పన చేసి సభికులను రంజింప చేయడంలో మేటి సమన్వయ ద్వయం ఎంపిడిఓ సత్తయ్య, ప్రధానోపాధ్యాయులు వీరకాంతం. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సమన్వయ ద్వయం జిల్లా పరిషత్ వెంకటాపూర్ తండా ప్రధానోపాధ్యాయులు వీరకాంతం వికారాబాద్ ఎంపీడీవో సత్తయ్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చమత్కార చమక్కులతో రంజింప చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కొరకు చేసిన పోరాట సన్నివేశాలను ఉదహరిస్తూ వ్యాఖ్యానం చేయడం ప్రశంసనీయమైనదని పలువురు ఉదహరించారు. కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఎత్తు అయితే కార్యక్రమాన్ని రంజింప చేసే విధంగా వ్యాఖ్యాతలు వర్ణించడం మరో ఎత్తు. కార్యక్రమాన్ని చూసే ప్రేక్షక లోకానికి ఎక్కడ కూడా విసుగు రాకుండా చూడడమే వ్యాఖ్యాతల ప్రధాన లక్ష్యం. 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని సందర్భానుచిత సమయస్ఫూర్తితో వ్యాఖ్యానం చేయడం విశేషం. వ్యాఖ్యాతలుగా వ్యవహరించాలంటే భాషా పరిజ్ఞానంలో పట్టు సాధించడం అత్యంత ఆవశ్యకం. అన్ని వర్గాల ప్రజలను సభా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగే విధంగా వ్యాఖ్యానించి సంతోష పరచడమే వ్యాఖ్యాతల ప్రథమ లక్ష్యం. వెంకటాపూర్ తండా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు కే వీరకాంతం తన భాషా వాక్చాతుర్యముతో సభాసీనులైన పెద్దలను ప్రేక్షకులను అధికారులను ప్రజాప్రతినిధులను హృదయానికి హత్తుకునే మాటలతో చమత్కరించడం ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. సమన్వయ ధ్వయం వెంకటాపూర్ తండా ప్రధానోపాధ్యాయులు కే వీరకాంతం వికారాబాద్ ఎంపిడిఓ ఎం సత్తయ్య ను జిల్లా కలెక్టర్ కె.నిఖిల అభినందిస్తూ ధ్రువపత్రంతో సన్మానించారు. జిల్లాలో తలపెట్టిన ప్రతి సాంస్కృతిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రోటోకాల్ వివాదాలు రాకుండా విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు ఎంపిడిఓ సత్తయ్యను వెంకటాపూర్ తండా ప్రధానోపాధ్యాయులు కే వీరకాంతంను మనస్ఫూర్తిగా అభినందించి వారికి జిల్లా కలెక్టర్ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.