పేద,సామాన్య,మధ్య తరగతి ప్రజల గుండెల్లో ఆరని దీపం మాజీ సీఎం డా.వైఎస్సార్

Published: Saturday September 03, 2022
కోరుట్ల, సెప్టెంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కుటుంబం అధ్వర్యంలో రైతు,కార్మిక,కర్షక,
పేద,సామాన్య,మధ్య తరగతి ప్రజల గుండెల్లో ఆరని దీపం అయినా మాజీ సీఎం డా.వైఎస్సార్ 13 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా డా.వైఎస్సార్ 1400 వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి ప్రజల గుండె ఘోష ను అతి దగ్గరనుంచి విన్న నేత,అపర భగీరథుడు,ఖరీదైన కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన ఘనుడు,108,104 అంబులెన్సులు,ఇందిరమ్మ ఇళ్లు,రైతులకు ఉచిత కరెంట్, ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ,పెన్షన్లు,పావలా వడ్డీకే లక్ష రూపాయల ఋణం, మైనారిటీలకు 4 % రిజర్వేషన్,విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్,రెండు రూపాయలకే కిలో బియ్యం,ఐకెపి సెంటర్లు,రైతులకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం సబ్సిడీ అందించిన కాంగ్రెస్ ధృవతార ఉమ్మడి ఏపీ మాజీ సీఎం,జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత స్వర్గీయ శ్రీ డా.వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ కన్నీటి నివాళి అర్పించారు.ఈ  కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు బర్కం చిట్టిబాబు,మాజీ ఎంపీటీసీ బర్కం నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ విట్టల రవీందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ ద్యాగ గంగాధర్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముహమ్మద్ నబీ, బూత్ ఎన్రోలర్స్ పిట్టల రమేష్, బర్కం వెంకట్ నారాయణ, కాంగ్రెస్ నాయకులు బండ్ల రమేష్, సిరిపురం రాజ గంగారాం,ప్రిన్స్ ఫరూక్, పడాల రాజం, రసత్ పాషా, ఓరుగంటి రాజు,బర్కం పెద్ద నర్సయ్య,కటుకం రాజేశం,కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్,నవాజ్,నిసార్ మరియు తదితరులు పాల్గొన్నారు.