ప్లాస్టిక్ నిషేధంపై రాయికల్ పట్టణంలో అవగాహన ర్యాలీ

Published: Saturday July 02, 2022
రాయికల్, జూలై 01(ప్రజాపాలన ప్రతినిధి): భారత పర్యావరణ,వాతావరణ, అటవీశాఖలు దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం, వినియోగంపై'జూలై 2022' నుండి పూర్తి నిషేధంవిధించబడిన సందర్భంగా ఈరోజు రాయికల్ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన  కల్పించుటకు రాయికల్ పురపాలకసంఘంతమ సిబ్బందితోకలిసి మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీవిగ్రహం చౌరస్తావరకు ప్లాస్టిక్ నిషేధముపైఅవగాహన ర్యాలీనిర్వహించి ప్రజలచే,సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధమును పాటించడం అంటే వ్యక్తిగతబాధ్యత కాదని, సామాజికబాధ్యతఅని,   ప్లాస్టిక్ రహిత స్వచ్ఛరాయికల్ గా తీర్చిదిద్దుటకు పట్టణ ప్రజలు,వ్యాపారస్తులు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ మోర హనుమాన్లు,కమిషనర్ జి.సంతోష్ కుమార్,వైస్ చైర్మన్ జి.రమాదేవి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,మేనేజర్ వెంకటి,మెప్మాఆర్పీలు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.