అంగన్వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Published: Tuesday March 15, 2022
మంచిర్యాల టౌన్, మార్చి14, ప్రజాపాలన: అంగన్వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సోమవారం రోజున తెలంగాణ అంగన్వాడీ టీచర్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా మార్చి 28, 29 తేదీలలో జరిగే సమ్మె నోటీసును లక్షేట్టిపేట్ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శారదా కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. 2020 నూతన జాతీయ విద్యా విధానంను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఐసిడిఎస్ యధావిధిగా కొనసాగించాలి. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని, ప్రభుత్వ శాఖగా గుర్తించి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసం ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని, 45వ ఐల్ సి ప్రకారం అంగన్వాడీలకు పిఎఫ్, పెన్షన్, ఇఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ క్రింద పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వన్ని విజ్ఞప్తి చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగన్వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి, జన్నారం మండలల అంగన్వాడీ టీచర్స్ కళావతి, నస్రీనాబేగం,  సుశీల, రాజమణి, సరస్వతి, స్వర్ణలత పద్మ, సుజాత, కృప, లక్ష్మి, విజయలక్ష్మి శంకరక్క, తదితరులు పాల్గొన్నారు.